గొర్రెల కాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎలుక రాజు యాదవ్

 

జగిత్యాల ప్రతినిధి, జూన్ 22,(ప్రజా బలం) గొర్రెల కాపారుల సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ఎలుక రాజు యాదవ్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ ఉత్తర్వులు జారీచేశారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో గొర్రెల కాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎలుక రాజు యాదవ్ ను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు యాదవులు, కురుమలు, గొర్ల కాపరులు ఎదురుకొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించినట్లు రాజు యాదవ్ పేర్కొన్నారు. అలాగే గొర్రెల కాపరుల అభివృద్ధికి, సంక్షేమానికి కృషిచేయాలని, గొర్రెల పెంపకంలో పశుపోషణ, ఎగుమతులు, మార్కెటింగ్ ల నూతన ఆవిష్కరణల కోసం, సంఘ విస్తరణ కోసం కృషిచేయాలని సూచించినట్లు ఎలుక రాజు యాదవ్ చెప్పారు. తన నియామకం కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ తోపాటు ప్రతి ఒక్కరికి ఎలుక రాజు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పలుమారు మల్లేష్ యాదవ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వేల్పుల నాగరాజు యాదవ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking