-దివ్యాంగులకు స్కూటీ వాహనాలను పంపిణీ చేసిన -తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు,
ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి
మెదక్ తూప్రాన్ ఫిబ్రవరి 18 ప్రజా బలం న్యూస్
) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మునిసిపాలిటీ పరిధిలోని మిని మైదానంలో క్రీడ పోటీలను శు క్రవారంరాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కబడ్డీ క్రీడాకారులతో కరచాలనం చేస్తు వారిలో స్ఫూర్తి నింపారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు వాహనాలను
పంపిణీ పంపిణీ చేశారు. దివ్యాంగులతో కాసేపు ముచ్చటించారు.
తూప్రాన్ మండల జడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బద్దం మహేష్ పటేల్ చొరవతో ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సహకారంతో సి ఎస్ ఆర్ స్కీం ద్వారా మంజూరు చేయబడిన మూడు చక్రాల వాహనాన్ని మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం గుండ్రెడ్డి పల్లికి చెందిన దివ్యాంగురాలైన చల్ల రాజేశ్వరి కి మంత్రి హరీష్ రావు , తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యనిర్వహక అద్యక్షులు చిట్కుల మహిపాల్ రెడ్డి, ఎప్డీసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజు కానుకగా 69 మంది దివ్యాంగులకు 1లక్ష రూపాయల విలువగల స్కుటిల పంపిణీ
చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ స్కూటీతో దివ్యాంగుల జీవనవిధానమే మారిపోతుంది అన్నారు. దివ్యాంగుల విషయములో భారతదేశంలోనే 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చే నాయకుడు మన కేసీఆర్ అని తెలిపారు. ఎ రాష్ట్రంలోను ఇంత ఎక్కువ పెన్షన్ లేదు. దివ్యంగులను ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపులో
పెట్టుకుని చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో గజ్వేల్ లో అద్భుతమైన క్రీడా ప్రాంగణం న్ని నిర్మించుకుందాం అభివృద్ధి లో ముందుకు పోదాం అన్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడలలో గుర్తింపు పొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీచైర్మన్ రోజు రాధా కృష్ణా శర్మ, ఎష్ఠిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి , తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం కార్య నిర్వాహ అధ్యక్షుడు సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి, తూప్రాన్ మండల జడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్ , మండల ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్ , సర్పంచ్ రాజు రెడ్డి, ప్రశాంత్, బద్దం మహేష్, క్రుష్ణ, సాయి పటేల్ , యాదగిరి, ఎంపీటీసీలు సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.