ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 18 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని మండలంలోని అన్ని దేవాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి.లక్షెట్టిపేట గోదావరి తీరంలో మండలంలోని గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో స్నానమాచరించి గంగమ్మకు మొక్కులు చెల్లించి,ఆలయాల్లో శివపూజలు చేశారు.గూడెం, రాయపట్నం గోదావరి తీర ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటంతో స్నానాలను నిషేధించారు.దీంతో భక్తులు లక్షెట్టిపేట గోదావరికి భక్త్తుల రద్దీ పెరిగింది.స్నానాలకు వచ్చిన భక్తులకు ప్లాస్టిక్ వద్దు పర్యావరణం ముద్దు అని తెలుపుతూ….నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్ రావు స్థానిక బిఆర్ఎస్ నాయకుతో కలిసి చేతిసంచులను పంపిణి చేశారు. అవోపా ఆధ్వర్యంలో భక్తులకు అరటిపండ్లు,లక్షెట్టిపేట పెయింటింగ్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు.వాటర్ ప్యాకెట్లు అందజేశారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు,ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎస్ఐ లక్ష్మన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.