మెదక్ తూప్రాన్ ఫిబ్రవరి 18, 2023 ప్రజా బలం న్యూస్ :-
కోరిన కోరికలు తీర్చే భక్తుల పాలిట దేవుడు మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ బాలాంజనేయ స్వామి మందిరము అని పురహితులు వెద పండితులు సాయిరాం శర్మ
అన్నారు. మహాశివరాత్రి ని పురస్కరించుకొని శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తూప్రాన్ పట్టణం బాలాంజనేయ స్వామి మందిరంలో శివలింగానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకొని మందిరం కు వచ్చే భక్తులకు సౌకర్యార్థంగా పురోహితులు సాయిరాం శర్మ ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.. భగవంతుడు శివుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో రాష్ట్ర ప్రజలు జీవించాలని తెలిపారు. అనంతరం ఆలయంలో ఉన్న గణపతి పంచాయతన స్వాములకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివుని ఈ కార్యక్రమంలో పురోహితులు రామకృష్ణ శర్మ, బ్రాహ్మణులు, పండితులు గ్రామస్తులు భక్తులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.