అలరించిన రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు.

 

*నగరంలో జరిగిన
వివిధ కేజీల విభాగాలలో పోటీ పడ్డ బాడీ బిల్డర్లు*
నగరంలో బాడీ బిల్డర్ల పోటీలు అలరించాయి. ఎన్ ఎన్ ట్రస్ట్, స్కై జిమ్ సహకారంతో సత్యసాయి బాడీ బిల్డింగ్ తో పాటు మిస్టర్ వరంగల్ బాడీ బిల్డింగ్ లో కొనసాగిన ఈ పోటీలలో రాష్ట్రస్థాయిలో 50 కేజీల నుండి మొదలుకొని 90 కేజీల వరకు వివిధ విభాగాలలో నిర్వహించిన పోటీలలో బాడీ బిల్డర్లు తమ దేహ దారుఢ్యాన్ని, శరీర కండరాల సౌష్టవాన్ని విక్షూస్తున్న క్రీడ అభిమానులతో పాటు న్యాయ నిర్ణేతల ముందు ప్రదర్శించారు.
ఇండియన్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అనుబంధంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలలో రాష్ట్రం నుండి అన్ని జిల్లాల నుండి బాడీ బిల్డర్లు పాల్గొని తమ ప్రదర్శ న ను యిచ్చారు. మిస్టర్ తెలంగాణ హైదరాబాద్ కి చెందిన గెలుపొందారు. మిస్టర్ వరంగల్ బాడీ బిల్డింగ్ ఓవరాల్ టైటిల్ను ఎండి కాజా కైవసం చేసుకున్నారు విజయాలు నిలిచిన వారికి కార్పొరేటర్ మారుపళ్ళ రవి శిల్ట్ బహుమతులను అందించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన వరంగల్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ ను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చరవాణి ద్వారా అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పోటీలలో విద్యార్థులకు అండగా ఉంటే నేషనల్ పోటీలకు వెళ్లడానికి సహకరిస్తామని అన్నారు. వరంగల్ యువత క్రమశిక్షణతో వ్యాయామం చేసే మంచి ఆరోగ్యం తో దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరి సింగ్ వైస్ ప్రెసిడెంట్ ఇంతియాజ్, సురేష్ బసవరాజు కుమారస్వామి ఆడకు శ్రీనివాస్ రెడ్డి కుమారస్వామి సిద్ధం రాజు, రంజిత్, కడారి సదానందం, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking