మెదక్ ప్రజాబలం న్యూస్ :-
నీలం మధు గెలుపు ఖాయం..
పేదింటి బిడ్డ నీలం మధు..
బీఆర్ఎస్, బిజెపిలు*
*ఎవరికి టికెట్లు ఇచ్చాయో? ఆలోచించండి.
పరిశ్రమలు, నిధులెన్ని తెచ్చావో?
*రఘునందన్ రావు చెప్పాలి..
మెదక్ కు 10 ఏళ్లుగా సీఎం కేసీఆర్, అల్లుడు హరీష్ రావు చేసింది ఏమీలేదు?
ఇందిరా గాంధీ హయాంలోనే పరిశ్రమలు… వేలాది మందికి ఉపాధి అవకాశాలు..
కారు కార్ఖానాకుకు పోయింది…
25 ఏండ్లలో రెండు పార్టీలు ఏం వెలగబెట్టారు..
కాంగ్రెస్ ను టచ్ చేస్తే మాడి మసైపోతారు..
ఆడబిడ్డలను అక్కున చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
పల్లకిలో ఇందిరమ్మను పార్లమెంటుకు పంపిన ఘనత మెతుకు సీమది..
దానికి ప్రతిగా పరిశ్రమలు తెచ్చి ఉపాధికి కేంద్రంగా మార్చింది..
మెదక్ గడ్డపై బలహీనవర్గాల బిడ్డ నీలం మధును గెలిపించండి..
మళ్లీ మీ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా.
మెదక్ సభలో సీఎం రేవంత్ రెడ్డి..
మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నీలం మధు నామినేషన్ ప్రక్రియ, కార్నర్ మీటింగ్ కు విచ్చేసిన సీఎం రేవంత్ .
ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ , దామోదర్ రాజనర్సింహ, శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు , మదన్ రెడ్డి, నర్సారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, గంగాధర్, ఎలక్షన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మామిండ్ల కృష్ణ ముదిరాజ్, కృష్ణ, కొడిపాక నారాయణ గుప్తా , శ్రీశైలం గౌడ్, రవీందర్ గుప్తా, బుడ్డ భాగ్యరాజ్, తిమ్మాపురం నరసింహులు , మామిళ్ల శ్రీనివాస్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
