మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు రాధికాగుప్తా
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 1:
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోఈ నెల 10 నుండి 17 వ తేది వరకు 1-19 సంవత్సరాల వయసు గల పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు అందించాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు రాధికాగుప్తా తెలిపారు.
శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేషనల్ వామింగ్ డే సమీక్షా సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిరఘునాథరావుతో కలిసి జిల్లా అదనపు కలెక్టరు హాజరయ్యారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టరు మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 10 నుండి 17 తేది వరకు జిల్లాలో 1 -19 సంవత్సరాల పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు అందించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కాలేజీలలోఈ మాత్రలను అందించాలన్నారు. అంతే కాకుండాఆశా, అంగన్ వాడీ వర్కర్లు వారి వారి పరిధిలో ఇంటింటికి వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 1-2 సంవత్సరాల చిన్నారులకు సగం మాత్రం, 2-3 పిల్లలకు మొత్తం మాత్ర పొడిచేసి అందించాలని, 3-19 పిల్లలకు మాత్ర చప్పరించాలని సూచించారు. ఈ నెల 17 వ తేదిన మాపప్ డే నిర్వహించి పై తేదిలలో అందుబాటులో లేని పిల్లలకు ప్రత్యేక శ్రద్ద వహించి ఈ మాత్రలు అందించాలన్నారు.
అనంతరం అదనపు కలెక్టరు జిల్లాలో మాతా శిశు మరణాల పై సమీక్ష నిర్వహించి చిన్న చిన్న సమస్యలతో శిశువుల మరణాలు సంభవిస్తున్నాయని, అలా జరుగకుండా తల్లిదండ్రులకు అవగాహాన కల్పించాలని అంతే కాకుండా గర్భందాల్చిన అనంతరం రోటీన్ చెకప్ కోసం ఆసుపత్రులకు వచ్చిన ప్రతిసారి తల్లికే కాకుండా కుటుంబసభ్యులకు కూడా బిడ్డ పుట్టిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పూర్తి అవగాహాన కల్పించాలన్నారు. పుట్టిన బిడ్డలలో ఏదైన అనారోగ్య సమస్య ఉన్నట్లయితే వారి చికిత్సకు కాలయాపన జరుగకుండా సరైన మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత డాక్టర్లదే అన్నారు. జిల్లాలో మొత్తం 5 శిశుమరణాల కేసులు నమోదయ్యాయని అందులోరెండు వలసదారుల శిశు మరణాలు ఉన్నాయన్నారు. వలసదారులకు కూడా అవసరమైన మేరకు అవగాహాన కల్పించి శిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.