ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 1:
ఈరోజు గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ చీర్యాల డైరెక్టర్ డా.ఉదయ కుమార్ సుసరియా వారి సౌజన్యంతో అదే కాలేజీనందు ఆర్ ఎస్ ఇ టీ ఐ చిలుకూరు వారి సహకారంతో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు
అగరొత్తులు తయారీ శిక్షణ ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారు.
ఇందులో డైరెక్టర్ డా.ఉదయ కుమార్ సుసరియా, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సి శివ ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె సాగర్, కన్వీనర్ డాక్టర్ జి.నీరజా రాణి, కోఆర్డినేటర్, ఇన్నోవేటివ్ మరియు ఇంక్యుబాటిమ్ మేనేజర్ డాక్టర్ బి.నాగమణి, కోఆర్డినేటర్
డాక్టర్ ఎన్. సుభద్ర, కోఆర్డినేటర్
డా.వి.స్.త్రివేణి,ఆర్ ఎస్ ఇ టి ఐ చిలుకూరు డి మురళి మరియు చీర్యాల గ్రామ 25 మహిళలు పాల్గొన్నారు.
డైరెక్టర్ డా.ఉదయ కుమార్
మరింత మందికి తెలియపరచి ఈ సదవకాశం వినియోగించుకోవాలని కోరుతూ అవసరమైనచో బస్సు సౌకర్యం కూడా ఉంటుందని తెలిపారు.
అర్హులైన అభ్యర్థులందరు
అధ్యాపకులు డి మురళి ని
8500165190 నందు సంప్రదించి తమ పేరును నమోదు చేసుకుని శిక్షణ ఉచితంగా పొందవచ్చు