ప్రజాబలం మందమర్రి, డిసెంబర్ 22 :
సింగరేణి దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మందమర్రి ఏరియాలోని కాలనీలలో
ఉత్తమ పర్యావరణహిత గృహాల పోటీలను సింగరేణి ఉద్యోగులు నివసించే గృహాలను వారు పెంచుకునే మొక్కలను ఇంటి పరిసరాలు, వాతావరణం, ఇంటిని అలంకరించుకున్న విధానమును ఎంపిక కమిటీ సభ్యులు పరిశీలించారు. గృహ శోభ పోటీలలో 9 మంది ఉద్యోగులు దరఖాస్తులు చేసుకోగా వారిలో ఎంపికైన గృహస్థులకు సింగరేణి దినోత్సవ వేడుకల్లో మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ జి .దేవేందర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎస్టేట్ అధికారి వెంకట్ రెడ్డి, ఫారెస్ట్ అధికారి రమణారెడ్డి, డి వై పి ఎం సత్య బోస్, పర్యావరణ సిబ్బంది పాల్గొన్నారు.