దక్షిణ మధ్య రైల్వే జిఎం ను కలిసిన సింగరేణి సీ అండ్ ఎండీ

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 21 :

రానున్న రోజుల్లో థర్మల్ కేంద్రాల్లో బొగ్గు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బొగ్గు రవాణా సాఫీగా సాగేందుకు ఇకపై రోజుకు కనీసం 40 రేకులను అందుబాటులో ఉంచాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కోరారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సానుకూలంగా స్పందించారు. రైల్ నిలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న థర్మల్ కేంద్రాలకు తగినంత బొగ్గును సరఫరా చేయడం కోసం రోజుకు 40 రేకుల అవసరం ఉందన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ అరుణ్ కుమార్ జైన్ స్పందిస్తూ దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే ఎన్నో ఏళ్లుగా సమన్వయంతో సేవలు అందిస్తున్నాయని, ఇకపైనా డిమాండ్ మేరకు రేకులను పెంచడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సింగరేణి జీఎం(మార్కెటింగ్) రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking