ప్లాస్టిక్ ను వినియోగిస్తున్న వైన్ షాపుకు జరిమానా

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 22 :

తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం మున్సిపల్ కమిషనర్ నిలిగొండ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మందమర్రి పట్టణంలోని పావని వైన్ షాపుపై శనివారం మున్సిపల్ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా 120 మైక్రన్ల కంటే తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ గ్లాసులు వాడటం వలన ఆహార పదార్థాల తయారీలో నాణ్యత, పరిశుభ్రత పాటించుటకు నిల్వ ఉన్నవార ప్రాంతాలపై ఈగలు దోమలు వాలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వారికి సూచనలు జారీ చేసారు. అనంతరం వైన్ షాపుకు 3500 రూపాయలు జరినామ విధించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ వి. శ్యాంసుందర్, రెవెన్యూ ఆఫీసర్ పి కృష్ణ ప్రసాద్ , హెల్త్ అసిస్టెంట్ ఎం.ఏ. సమీర్, బిల్ కలెక్టర్ లింగయ్య, బి. శ్యాంబాబు, వి. ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking