జోనల్‌ కమీషనర్‌ రవికుమార్‌కు నివేదిక సమర్పించిన

ఏ సుదర్శన్‌ శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సికింద్రాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: శనివారం నాడు సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ రవికుమార్‌ ని కలవడం జరిగింది
సర్కిల్‌ 16 సర్కిల్‌ 15 లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులపై చర్య తీసుకోవాలని కలవడం జరిగింది ఒకపక్క జిహెచ్‌ఎంసి ని మరోపక్క తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నారు ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు ప్రతిరోజు పేపర్లలో టీవీలలో వీళ్ళ గురించి వస్తుంది కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు
త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని టౌన్‌ ప్లానింగ్‌ అక్రమాలపై నివేదిక సమర్పించి వీళ్లను వీళ్ళపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం గారిని కోరడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం జీతాలు తీసుకుంటూ అక్రమ నిర్మాణదారుల నుంచి డబ్బులు తీసుకోవడం దేనికి సంకేతం దీని పై సమగ్ర విచారణ జరిపించి ఈ అధికారుల పై చర్య తీసుకోవాల్సిందిగా సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ రవి కుమార్‌ కి నివేదిక సమర్పించడం జరిగింది
అదేవిధంగా జిహెచ్‌ఎంసి కమిషనర్‌ తో మీటింగ్‌ అని చెప్పి సరైన సమయానికి డ్యూటీకి రావడం లేదు
ఏ సుదర్శన్‌ శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Leave A Reply

Your email address will not be published.

Breaking