అమిత్‌ షా ని వెంటనే అరెస్టు చేయాలి అని కోరిన వి హెచ్‌ ఆర్‌.

అంబర్‌ పేట్‌ ప్రజాబలం ప్రతినిధి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పైన అమిత్‌ షా అనుచిత వ్యాఖ్యలను చేసినందుకు ఖండిస్తూ పెద్దలు వి. హనుమంతరావు అంబర్పేట్‌ పోలీస్‌ స్టేషన్లో ఇన్స్పెక్టర్‌ అశోక్‌ కి కంప్లైంట్‌ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వి. హనుమంతరావు మాట్లాడుతూ మన రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పైన అమిత్‌ షా అందరికీ అంబేద్కర్‌ అంబేద్కర్‌ అని ఫ్యాషన్‌ అయిపోయింది అని, దేవుడిని స్మరించిన పుణ్యం వస్తుంది అని, చేసిన వ్యాఖ్యలను ఖండిరచారు.రాజ్యాంగ నిర్మాత కి ఇలాంటి అవమానం జరిగిందని, వెంటనే అమిత్‌ షా తన పదవికి రాజీనామా చేయాలని మరియు దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చేయాలని డిమాండ్‌ చేస్తూ కంప్లైంట్‌ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఖైరతాబాద్‌ జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్‌ గౌడ్‌ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌ షా ని, వెంటనే శిక్షించాలని దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ నిర్మాతనే కించపరిచి, అవమానించే విధంగా మాట్లాడిన మంత్రుల చేతిలో ఈరోజు దేశ పాలన ఉందని ,ఇది మన దౌర్భాగ్యమని వారు అన్నారు. ఈ విషయం పైన ప్రధాని మోదీ ఇంతవరకు స్పందించకపోవడం ఎంతో బాధాకర విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking