వైయస్సార్ తెలంగాణ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి కల్పన గాయత్రి గారి ఆధ్వర్యంలో క్రిస్టమస్ పండుగ సందర్భంగా ఉప్పల్ బీరప్ప గడ్డ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్స్ మరియు పండ్ల పంపకాలు అందజేశారు.ఈ సందర్భంగా కల్పన గాయత్రి గారు మాట్లాడుతూ వైయస్ షర్మిలమ్మ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని చర్చిలో వైయస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు ప్రార్థనలు జరిపి కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మహిళలకు అండగా నిలిచి వారికి స్వయం ఉపాధి చిన్న కుటీర పరిశ్రమల్లో లబ్ధి చేకూరాలని రాబోయే రోజుల్లో వైయస్ షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు అహర్నిశలు మనమంతా కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మరల తిరిగి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకురావాలని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహిళ నాయకురాలు నందిని ,నాగేంద్రమ్మ పాస్టర్ రాంబాబు, తండుభాస్కర్ గంగాధర్ యాదవ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు