కరుణగిరిలో ఆదివారం సాయంత్రం మూడు గంటల నుండి ప్రారంభం
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి హాజరైన మత గురువులు
ప్రత్యేక ప్రార్థనలు కోసం ముస్తబు చేసిన కరుణగిరి పుణ్యక్షేత్రం
ఖమ్మం ప్రతినిధి (ప్రజాబలం) ఖమ్మం క్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చి 2025 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా క్రైస్తవ మత పెద్ద ఆయన పోపు ఈ సంవత్సరానిని జూబ్లీ సంవత్సరముగా ప్రకటించి సంవత్సరం మొత్తం వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చిన దానిలో భాగంగా ప్రపంచం మొత్తం ఈ వేడుకలను నిర్వహించినది ప్రపంచం మొత్తం ఈ వేడుకలను క్రైస్తవ సోదరులు నిర్వహించినారు

ఇందుకోసం ఈ సంవత్సరం కాలం వివిధ విభాగాలు వేడుకలను నిర్వహించినారు. క్రైస్తవ గురువులు, మటకన్యలు బ్రదర్లు మహిళలు ,యువత, గృహస్థ క్రైస్తవులు, లిజన్ ఆఫ్ మేరీ, అనేక విభాగాలు ఈ యొక్క వేడుకలను నిర్వహించి ఈ ముగింపు వేడుకలకు సిద్ధపడినారు ఈ ప్రత్యేక ప్రార్థనలు ప్రపంచంలో ప్రపంచంలో లో శాంతి సమాధానాలు కలిగి ఉండాలని సమాజంలో హింసలకు తావు లేకుండా యుద్ధాలు కరువులు లేకుండా ప్రజలంతా సోదర భావన తో కక్షలు అసూయ ద్వేషాలు లేకుండా గడపాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో గడపాలని ప్రత్యేక ప్రార్థనలు సమిష్టి దివ్య పూజ నిర్వహించారు ఈ సందర్భంగా క్రైస్తవ సర్పంచులుగా ఉప సర్పంచులుగా గెలిచిన వారిని 25 సంవత్సరములు గా ఉపదేశులు గా సేవలందించిన వారికి ఘన సన్మానము చేసినారు విశ్వ ఈ కార్యక్రమ అధినేతగా ఖమ్మం నేత్రాసన పీఠాధిపతి డాక్టర్ శ్రీశ్రీశ్రీ సాగిలి ప్రకాష్ నిర్వహించినారు వీరితోపాటు ముఖ్యులైన ఫాదర్ లు ఐజాక్ ఫాదర్ సురేష్ ఫాదర్ విజయ్ ఫాదర్ కొమ్ము అంతోని ఫాదర్ జార్నీస్ ఫాదర్ కొమరవెల్లి జోసెఫ్ వికార్ జనరల్ తప్పట శౌరి వివిధ చర్చిలకు సంబంధించిన ప్రతినిధులు విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరము సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు వివిధ ప్రాంతాలలో చేయబడిన కార్యక్రమాల ఫొటోస్ ప్రదర్శించారు
