కూకట్పల్లి (ప్రజాబలం) ఏప్రిల్ 09:
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు బాలానగర్ సీఐ నర్సింహా రాజు కౌన్సెలింగ్ ఇచ్చారు. రానున్న వేడుకల దృష్టిలో ఉంచుకొని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరధిలో ఉన్న 5 మంది రౌడీషీటర్లకు సస్పెక్ట్ షీటర్లకు బాలానగర్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా సీఐ నర్సింహా రాజు మాట్లాడుతూ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వీరిపై పోలీసు నిఘా కూడా ఉందని పేర్కొన్నారు. వచ్చే వేడుకలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు తరలిస్తామని హెచ్చరించారు గతంలో నేరాలకు పాల్పడిన వారు నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని, హుందాగా జీవించాలని సూచించారు. నేరస్తుల తొందరపాటులో నేరాలు చేసినా వారి కుటుంబ సభ్యులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. నేరాలకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, భవిష్యత్తును, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మారండని రౌడీ షీటర్లకు సీఐ హితవు పలికారు. ఇందులో ఎస్ఐలు రాంనారాయణ్, సరితా రెడ్డి, వినోద్ సిబ్బంది పాల్గొన్నారు.