మందమర్రిలో మెగా రక్తదాన శిబిరం

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఏప్రిల్ 9:

మందమర్రి ఏరియాలోని స్థానిక సింగరేణి వృత్తి శిక్షణా కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ గాజర్ల దేవేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారుణ్య నియామకాల ద్వారా నూతనంగా ఉద్యోగం పొందిన కార్మికులు మరియు వివిధ గనుల డిపార్ట్మెంట్ నుంచి అధిక సంఖ్యలో కార్మికుల వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారని అన్నారు. బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరం 40వ రక్తదాన శిబిరం అని అన్నారు. ఇప్పటివరకు మందమర్రి ఏరియా నుండి 2856 యూనిట్లను మంచిర్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందజేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వృత్తి శిక్షణ కేంద్రం మేనేజర్ గుండేటి శంకర్ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మందమర్రి ఏరియా తరఫున ఎల్లప్పుడూ తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరాల నిర్వహించి వారికి అండగా ఉంటామని అన్నారు. అనంతరం రక్తదాతలకు ప్రశంస పత్రాలను ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం విజయ్ ప్రసాద్, ఏఐటియుసి మందమర్రి బ్రాంచి సెక్రెటరీ సలేంద్ర సత్యనారాయణ, వృత్తి శిక్షణ మేనేజర్ శంకర్, ట్రైనింగ్ అధికారి అశోక్ కుమార్, హెడ్ ఓవర్మెన్లు రాజేశం, రఘువరన్, గురుమూర్తి,పీ.హెచ్.సి వైద్యులు రమేష్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking