అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి సీఐ కృష్ణా రెడ్డి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 14 : అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లక్షెట్టిపేట సీఐ కృష్ణా రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్ వీకర్ సెక్షన్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీ ఐ మాట్లాడుతూ…కాలనీలోని యువత చెడు వ్యసనాలకు లోను కావద్దని సూచించారు. ముఖ్యంగా గంజాయి,ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. తమ పిల్లల ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని కోరారు. చెడు స్నేహం వలన నేర ప్రవృత్తి వైపు వెళ్లే పరిస్థితులు కూడా ఉంటాయని తల్లిదండ్రులకు వివరించారు.పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని పలు ఉదాహరణలతో గుర్తు చేశారు.అంతేకాకుండా బ్యాంకుల పేరుతో కాల్స్ చేసి ఓ టీ పీ, ఏ టీ ఏం పిన్ నెంబర్లు అడిగి డబ్బులు దోచుకునే సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ఆకతాయిలు మద్యం సేవించి రోడ్డు కూడలి వద్ద గుమిగుడుతున్నట్లు సీ ఐ కృష్ణా రెడ్డికి కొందరు కాలనీ మహిళలు తీసుకెళ్లగా, బ్లూ కోట్ సిబ్బంది తో గట్టి గస్తీ నిర్వహిస్తామని భరోసానిచ్చారు. అంతకుముందు కాలనీ కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…కాలనీ వాసులు మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలన్నారు. అందరి సహకారంతో కాలనీ వాసులకు పోస్టల్ ఇన్సూరెన్స్, సీ సీ కెమెరాల ఏర్పాటు కు కృషి చేస్తామని హామీనిచ్చారు. సరైన అనుమతి పత్రాలు లేని సుమారు 20 బైక్ లు,3 ఆటో లు, ఒక టాటా ఏసీ ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట దండేపల్లి,జన్నారం ఎస్సైలు లక్ష్మణ్,ప్రసాద్,సతీష్, ఏ ఎస్సై లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking