అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులివ్వండి

ఎమ్మేల్యే సంజయ్ ను కోరిన కండ్లపల్లి గ్రామస్తులు

జగిత్యాల, జులై 14: ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులివ్వాలంటూ కండ్లపల్లి గ్రామస్టులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎంఎస్ఎస్పీ జిల్లా కన్వీనర్ దూమాల గంగారాం సారథ్యంలో వెళ్లిన కండ్లపల్లి గ్రామస్తులు తమ గ్రామంలో అంబేద్కర్ భవన నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నామని దీనికి సరిపడా నిధులు మంజూరు చేయాలని కోరారు. వీరి అభ్యర్థనను స్పందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ నిధుల మంజూరికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రజిత శేఖర్, సంఘం అధ్యక్షులు గెగ్గర్ల నర్సయ్య, దుమాల గంగరాజం, మల్యాల నర్సయ్య, కోత్తురి నారాయణ, దండు శంకర్, దొనకొండ నర్సయ్య, దినకొండ నరేష్, బొమ్మేనా లక్ష్మణ్, వెల్మల మనోజ్ పెద్దలు పాల్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking