ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 26 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీఐ కృష్ణ అన్నారు.లక్షెట్టిపేట పట్టణంలోని వైష్ణవి మహిళ డిగ్రీ కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థినులకు డయల్ 100,షీటీమ్,సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ…విద్యార్థులు చదువుతో పాటుగా చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. చట్టాల గురించి తెలిసినప్పుడు తమ హక్కులు,బాధ్యతలు ఎలా నిర్వవర్తించాలో తెలుస్తుందన్నారు.ముఖ్యంగా విద్యార్థినిలు కళాశాల కు వచ్చే క్రమంలో ఆకతాయిలు ఇబ్బంది పెడితే వెంటనే షీ టీం కు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేకాకుండా ఎలాంటి సమస్య ఉన్న 100 కు డయల్ కాల్ చేస్తే పోలీసులు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించుతారన్నారు.అదే విధం విద్యార్థినులు కాలేజీ వచ్చి,పోయే సమయంలో ఆకతాయిలు వేధింపులకు గురిచేస్తే సమస్యను షీ టీమ్ పోలీసులకు తెలియజేయాలన్నారు.ఈ మధ్యకాలంలో ఆన్లైన్ లో చాలా మంది నష్టపోతున్నారని,ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు అడిగిన మీకు మీ తల్లితండ్రులకు ఫోన్ చేసి మీకు లోన్ ఇస్తామని చెబితే నమ్మకూడదన్నారు.ఎలాంటి పని ఉన్న నేరుగా బ్యాంక్ వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఇతరులు ఫోన్ చేసి మీకు ఓ టీ పీ వచ్చింది చెప్పమంటే చెప్పకూడదన్నారు.అనంతరం వస్తున్న రాఖీ పండగ సందర్భంగా విద్యార్థినులు సీఐ కి మరియు ఎస్సైకి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మణ్,కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్,కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.