మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

8వ విడత హరితహారం కార్యక్రమంలో బాగంగా మొక్కను నాటిన-జిల్లా ఎస్పీ చల్లా ప్రవీణ్ కుమార్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. మానవ జాతి మనుగడకు మొక్కలే జీవనాధారం అని, భవిష్యత్ తరాల వారికి స్వచ్ఛమైన గాలిని అందించడం మన బాధ్యత అని, అందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
8వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా సఖి కార్యాలయ ఆవరణoలో జిల్లా ఎస్పీ,అదనపు ఎస్పీ, తో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా ఈ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, 8 విడత హరితహారం కార్యక్రమoలో భాగంగా ఈ రోజు జిల్లా సఖి కార్యాలయo అవరణలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, ఫలితంగా అక్కడ ఉండే వారి యొక్క ఆలోచన విధానం కూడా మారుతుందని అన్నారు.భూ మండలం పై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు,ప్రాణ వాయువు అయిన ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, భూమి మీద పశుపక్షాదుల నివాసం చెట్లేనని, మానవ జీవన విధానంలో చెట్ల పాత్ర ఎంతో ముడిపడి ఉందని అన్నారు. 8వ విడత హరిత హారంలో భాగంగా జిల్లా పోలీసు శాఖకు అప్పగించిన లక్ష్యాన్ని పూర్తి చేయటం జరిగిందని, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల అవరణలలో, పోలీస్ శాఖకు సంబందించిన ఇతర భూమిలో విరివిగా మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటడం బాధ్యతగా భావించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలన్న, వారికి మంచి ఆరోగ్యoను అందించాలన్న ఇప్పటి తరంవారు విరివిగా మొక్కలు నాటడం తప్పనిసరి అని, మానవ జాతి మనుగడకు మొక్కలే జీవనాధారం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వీరన్న, ఏఓ యూనుస్, ఏస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు రమేష్, రామకృష్ణ, రాంనిరంజన్, ఆర్ఎస్ఐలు వినోద్, రవి కుమార్, సాయి కుమార్, సాయుధ దళా, డిసిఆర్బి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking