తూప్రాన్ లో ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన సి.ఐ. రంగ కృష్ణ.

 

గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్, మార్చి,10. ప్రతినిధి.

మెదక్ జిల్ల తూప్రాన్ పట్టణంలో మహిపాల్ గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్.కే.ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ను పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగ కృష్ణ, ఎస్. ఐ2 యాదగిరి తో కలిసి సోమవారం రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఎలక్ట్రిక్ బైక్ ను స్టార్ట్ చేసి నడిపించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ రంగ కృష్ణ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా డీజిల్, పెట్రోల్ వాహనాలు పూర్తిగా అంతరించి పోయి కాలుష్య నివారణ కోసం అందరూ ఎలక్ట్రిక్ చార్జింగ్ బైక్ లను వాడుతారని తెలిపారు. డీజిల్ పెట్రోల్ వాహనాల వల్ల విపరీతమైన పొగ వచ్చి కలుషితమైన కాలుష్యం పొగ వెదజల్లి మానవుల జీవన విధానానికి అవరోధం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఎస్ ఐ 2 యాదగిరి, మహిపాల్ గౌడ్, షోరూమ్ నిర్వాహకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking