-తహసిల్దార్ కు బీఎస్పీ నాయకుల వినతి
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 10
మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రం మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో గల ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మందమర్రి తహసిల్దార్ ఆఫీస్ ఎదురుగల హాల్ ఎనిమిది సంవత్సరాల నుండి నిరుపయోగంగా ఉంది, అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ పక్కన హ్యాపీ హోమ్స్ పేరిట నిర్మితమైన గదులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉన్నందున ఈ రెండింటిని ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలని బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో మందమర్రి తహసిల్దార్ ఎమ్మార్వో పి. సతీష్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాజుల శంకర్ మండల అధ్యక్షుడు ఎండి మతిన్ ఖాన్ నాయకులు ఐలోని రాజు ప్రజాసంఘాల నాయకులు రామ్సాని శేఖర్ తదితరులు పాల్గొన్నారు.