10 వ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చ్ 19 : జిల్లాలో జరుగుతున్న 10 వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఏప్రిల్ 2 వ తేదీ వరకు జరుగుతున్న 10 వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో రెగ్యులర్ విద్యార్థుల కొరకు 51 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 9 వేల 294 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను సెకండ్ లాంగ్వేజ్ తెలుగు/ఉర్దూ/హిందీ పరీక్షలను 9 వేల 273 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్ష నిర్వహణ కొరకు ముఖ్య పరిరక్షకులు, డిపార్ట్మెంట్ అధికారులు, సురక్షకులు,కస్టోడియన్లు, ఇన్సులేటర్లను నియమించడం జరిగిందని, పరీక్ష లోని ఎలాంటి మాస్ కాపీయింగ్ తావు లేకుండా అధికారులు పరీక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిబంధన మేరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మోసం జరిగిందని తెలిపారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు మూత్రశాల పరిశుద్ధం నిరంతర విద్యుత్ సరఫరా సౌకర్యాలు కల్పించడంతోపాటు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచడం జరిగిందని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం జరగదని తెలిపారు. జిల్లా విద్యాధికారి ఎస్ సాదయ్య చెన్నూర్ జైపూర్ భీమారం లోని 6 పరీక్ష కేంద్రాలను అసిస్టెంట్ కమిషన్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ 2 కేంద్రాలు, ఫ్లయింగ్ ,స్వ్కడ్ బృందాలు 18 పరీక్ష కేంద్రాలను సందర్శించిడం జరిగిందని, పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు చేపట్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల కేంద్రం నిర్వహణకు,సంబంధించిన శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking