బాలికలు, మహిళల రక్షణకు షీ టీమ్స్,

ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే 8712657963, సమాచారమివ్వండి.
జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్

మెదక్ ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా ఎస్.పి డా.బి.బాలాస్వామి ఐ.పి.ఎస్ గారి ఆదేశానుసారం జిల్లా అదనపు.ఎస్.పి అడ్మిన్ ఎస్‌.ఎస్.మహేందర్
జిల్లా షీ టీమ్ వారితో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా జిల్లా అదనపు.ఎస్.పి అడ్మిన్ ఎస్‌.ఎస్.మహేందర్ మాట్లాడుతూ…షి టీమ్ యొక్క కార్యకలాపాలు, ఈవ్-టీసింగ్ గురించి, మహిళలపై చిన్నారులపై జరుగు నేరాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, మహిళా రక్షణ, ఈతల వల్ల జరిగే ప్రమాదాలు మొదలగు విషయాలపై జిల్లా షీ టీం సబ్యులకు వివరించడం జరిగింది. అలాగే మహిళలను ఉద్దేష్యించి తెలుపుతూ ప్రస్తుత సమాజంలో పురుషుల తో పాటు స్త్రీలు సమానంగా పోటీ పడుతున్నారని ఉన్నత చదువులు చదువుకొని ఇంకా ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. ఎలాంటి ఆపద సమయంలో నైనా డయల్100 కు కాల్ చేసి పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని అన్నారు. మహిళలు మరియు చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఆకతాయిలు వలన మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే 8712657963, నంబరుకు ఫోన్ చేసి కానీ, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదును అందుకున్న వెంటనే షీ టీం పోలీసులు బాధిత మహిళలకు అండగా నిలుస్తారని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ యాదగిరి , ఏఎస్ఐ లక్ష్మి, కానిస్టేబుల్ జ్యోతి,
షీటీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking