ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశానికి నిర్మల్ జిల్లా దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ హాజరై కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ గారిని మరియు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండేటి శ్రీధర్ గార్లని శాలువాతో సన్మానించడం జరిగింది.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మూడువేల మంది ఎస్సీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, ప్రతి మండలం లోని గ్రామంలో బస్తీ సంపర్క్ కార్యక్రమం నిర్వహించాలని , రేపటినుండి జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు, మోర్చా నాయకులు కార్యక్రమంలో పనుల్లో నిమగ్నమై నరేంద్ర మోడీ ని మూడోసారి ప్రధానమంత్రిగా గెలుపునకు కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది.