చెరువులు కుంటలు ప్లాస్టిక్ చెత్త వ్యర్థ పదార్థాలను తొలగించి బిజెపి పట్టణ శాఖ.
సంగారెడ్డి జులై 5 ప్రజ బలం ప్రతినిది: డి అశోక్.
భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు ద్వారక రవి అధ్యక్షతన సంగారెడ్డి పట్టణంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వారోత్సవాల సందర్భంగా పెద్ద చెరువు వినాయక సాగర్ వద్ద క్లీన్ ఇండియా హెల్తి ఇండియా *ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం చెరువులు కుంటలు ప్లాస్టిక్ చెత్త మరియు వ్యర్థ పదార్థాలను తొలగించి శుభ్రపరచాలని ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి గోదావరి అంజి రెడ్డి మరియు రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే పాల్గొని చెత్త తొలగించడం జరిగింది. శ్రీమతి గోదావరి అంజి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సంగారెడ్డి పట్టణంలో చెరువులను కుంటలను శుభ్రపరచాలాఅని పట్టణ వాసుల అందరికి మంచి నీరు స్వచ్ఛమైన గాలి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయమని దేశ ప్రజలందరికీ స్వచ్ఛమైన నీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజా గౌడ్ ,మున్సిపల్ కౌన్సిలర్ మందుల నాగరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మీనా గౌడ్ ,పట్టణ ఉపాధ్యక్షుడు శివగుళ నాగరాజ్ , శ్రీనివాస్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి శివ ,అజయ్ కిసాన్ మోర్చా అధ్యక్షులు లింగమూర్తి ,గురునాథ్, తులసి రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు తేజస్విని, లక్ష్మి, సుబ్బలక్ష్మి ప్రవీణ మన్నే రవీందర్ ,శివశంకర్ పాటిల్, రాకేష్ గౌడ్ అభి ,వెంకట్ ,సతీష్, బాల మురళి, తదితరులు పాల్గొన్నారు.