ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జెడ్పీ పాలక వర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి కలెక్టర్ జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా జెడ్పి సీఈవో గోవింద్,ఇతర అధికారులు కలెక్టర్ కు స్వాగతం పలికి పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కార్యాలయ విభాగాల ను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు