హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్ నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ శుక్రవారం పరిశీలించారు. కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు వివరాలను తెలుసుకున్నారు. సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు పనులు పూర్తి కావస్తున్నట్లు వారు తెలిపారు. బయట రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. భవనం మొత్తం కలియతిరిగి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. దాదాపు రూ. 617 కోట్లతో కనీవినీ ఎరుగని రీతిలో నూతన సచివాలయ నిర్మాణాన్నిచేపట్టారు. అత్యంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధునిక వసతులతో, ఎంతో విలాసవంతంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం జరిగింది. సచివాలయం పనులు దాదాపు పూర్తి అయ్యాయి. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ శాంతకుమారి, మంత్రి వేముల ప్రశాంత్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, అధికారులు ఉన్నారు.