ప్రధానమంత్రి రాష్ట్రీయ  బాలపురస్కార్ అవార్డు పొందిన హిమేష్

 

 

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 10: అల్జీమర్ వ్యాధిగ్రస్తులకు రిస్ట్ బ్యాండ్ రూపొందించిన హిమేష్ చదలవాడకు ప్రధానమంత్రి సంతకంతో కూడిన సర్టిఫికెట్, మెడల్, ట్యాబ్, వాచ్ అందించిన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్  అవార్డుకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో 2021 సంవత్సరానికిగాను మాస్టార్ హిమేష్ చదలవాడకు ఇన్నోవేషన్ కేటగిరీలో  భారత ప్రభుత్వం తరపున మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ శుక్రవారం హైదరాబాద్లోని కలెక్టర్ ఛాంబర్ లో  ప్రధానమంత్రి స్వదస్తూరీతో ఉన్న సర్టిఫికెట్తో పాటు మెడల్, ట్యాబ్, వాచ్ను అందించారు. హిమేష్ చదలవాడ అల్జీమర్ వ్యాధిగ్రస్తుల కోసం రిస్ట్ బ్యాండ్ను తయారు చేశారు. హిమేష్ తయారు చేసిన రిస్ట్ బ్యాండ్ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ అవార్డుకుఎంపికైంది. ఈ సందర్భంగా అవార్డు సాధించిన హిమేష్కు ఈ భారత ప్రధాని స్వయంగా చేసిన సంతకంతో కూడిన సర్టిఫికెట్, మెడల్, ట్యాబ్, శుభాశీర్వాద్ అని రాసి ఉండి ప్రధాని నరేంద్ర మోదీ సంతకంతో ఉన్న వాచ్ తో పాటు ధ్రువపత్రాన్ని అందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking