దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 10 ప్రజాబలం ఖమ్మం
మహిళలకు స్వేచ్ఛనిస్తే అన్ని రంగాల్లో రాణించగలరని స్త్రీ లేనిదే మనుగడ లేదని దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వరరాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఖమ్మం లో జరిగిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరయి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దోరెపల్లి శ్వేత మాట్లాడుతూ దేశం ఇవ్వాళ అన్నిరంగాల్లో ముందుకు సాగుతుంది అంటే దానికి మహిళ కూడా కారణమే అన్నారు.ఈ రంగం ఆరంగం అనకుండా ప్రతి రంగంలోనూ స్త్రీ పాత్ర లేకుండా లేదని అన్నారు.ఏ స్త్రీ అయితే నాగరికత తో ఆలోచిస్తుందో ఆ కుటుంబం చైతన్యవంతంగా ఆరోగ్యాంగా ఉంటుందని అన్నారు. ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కావేటి రేవతి ప్రపంచం అన్ని రంగాల్లో ఎంతో ఎత్తుకు దూసుకుపోతున్నప్పటికి నేటికీ మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు.అటువంటి హింసలకు పాల్పడుతున్న మనవామృగాలకు కళ్లెం వేసేందుకు,నిస్సహాయకురాలుగ మిగిలిన ఆమెకు అండగా ఉండేందుకు ఆవిర్భవించనదే దిశ అని అన్నారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking