భక్తి మార్గంతోనే ప్రశాంతత.
తూప్రాన్ ఆర్డీవో శ్యాం ప్రకాష్
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం సమీపంలో కిష్టాపూర్ రోడ్డులో పెద్దపెద్ద గుండ్ల మధ్యలో వందల సంవత్సరాల క్రితం వెలసిన మహాన్వితమైన స్వయంభు కూర్మ నరసింహ స్వామి దేవాలయ 4o వ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 10 నుండి 12వ తేదీ ఆదివారం వరకు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మొదటి రోజు తూప్రాన్ రెవెన్యూ డివిజన్ ఆర్డీవో శ్యాంప్రకాష్ విచ్చేసి నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి భావనతోనే ప్రశాంతత ఏర్పడుతుందని పేర్కొన్నారు, ఆలయ ప్రధాన అర్చకులు అహోబిలం రమణయ్య పంతులు ఆధ్వర్యంలో
శుక్రవారం నరసింహస్వామి వారి విశ్వక్సేన పూజ పుణ్యావాచనము రక్షాబంధనము అఖండ దీపారాధన దేవతా హవనములు స్వామివారికి అభిషేకము మంటపారాధన అంకురా ద్వారము బజారోహరము స్వామివారికి ఆరాధన సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణము ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మామిండ్ల కృష్ణ
శ్రీ చూర్ణం విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి కంటాయపాలెం వేణుగోపాల్ ,,
తీగల అంజయ్య, గుజ మహేష్, పేర్ల మధుసూదన్, లక్ష్మణ్ పురోహితులు వెంకటకృష్ణ యాదగిరి స్వామి,గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.