ఖమ్మం ప్రతినిధి మార్చి 10 (ప్రజాబలం) ఖమ్మం సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో వివిధ శాఖల కార్యాలయాలను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ శుక్రవారం ఆకస్మికంగా తణిఖీ చేశారు. వైద్య ఆరోగ్య, విద్యా, మైన్స్, మైనారిటీ సంక్షేమ, జిల్లా సంక్షేమ, జిల్లా పంచాయితీ అధికారి, పౌరసరఫరాల, కార్యాలయాల్లో ఉద్యోగుల వివరాలను పరిశీలించారు. ఉద్యోగులు సమయపాలన పాటించే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రతి కార్యాలయంలో ఈ`ఆఫీస్ విధానంలో ఫైల్స్ నిర్వహణ ఉండాలని, భవన సముదాయంలో అన్ని శాఖల ఉద్యోగులు ఐ.డిఓసిలో ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్‌లో బోజనం చేయాలన్నారు.
అనంతరం ఐ.డి.ఓ.సిలో ఏర్పాటు చేసిన క్రచ్చే పిల్లల సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. మహిళా ఉద్యోగుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రచ్చే కేంద్రాన్ని సద్వినియోగ పర్చుకోవాలని కలెక్టర్ తెలిపారు. మహిళా ఉద్యోగులు విధుల నిర్వహణకు ఇబ్బంది కలగకుండా వారి చిన్న పిల్లలను సంరక్షణ కేంద్రం క్రచ్చేలో సంరక్షకులకు అప్పగించి నిశ్చింతగా తమ విదులను సమర్ధవంతంగా నిర్వర్తించాలన్నారు.
కలెక్టరేట్ పరిపాలన అధికారి కె.శ్రీనివాసరావు కలెక్టర్ వెంట ఉన్నారు.