కంటి వెలుగు శిబిరాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 10 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రం రాజీవ్‌ విద్యామిషన్‌లో ఏర్పాటు చేసిన కంటివెలుగు వైద్య శిభిరాన్ని జిల్లా కలెక్టర్‌ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కంటి వెలుగు కేంద్రంలో రోజువారి నిర్వహిస్తున్న పరీక్షలు, అందిస్తున్న కళ్ళజోళ్ల వివరాలను, ప్రిస్‌కిప్షన్‌ కళ్ళజోళ్ళ ఇండెంట్‌లను కలెక్టర్‌ పరిశీలించారు. కంటి వెలుగు కేంద్రానికి 506 కళ్ళజోళ్లు రావడం జరిగిందని, పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరుగుతుందని, అవసరమైన వారికి ప్రిస్‌కిప్షన్‌ కళ్ళజోళ్ళను ఇండెంట్‌ పెట్టడం జరిగిందని వైద్యులు వివరించారు. కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతి, కంటి వెలుగు ఇంచార్జ్‌ శ్రీదర్‌, వైద్యులు ఉదయలక్ష్మీ, మాదవి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking