సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం నిర్మల్ డీసీసీ అధ్యక్షులు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన 47 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు మంజూరయ్యాయి.ఈ మేరకు లబ్దిదారులకు సోమవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంప్ కార్యాలయంలో చెక్కులను అందజేసారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.వేలాది మంది పేద,మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన, ప్రజా పాలన చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పీసీసీ సభ్యులు సాద సుదర్శన్,మండల పార్టీ అధ్యక్షులు బుజంగా శ్రీనివాస్ రెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డి,వేణుగోపాల్ కుంట,మధుకర్ రెడ్డి,రాంరెడ్డి,వాజీద్ ఖాన్,కౌన్సిలర్లు మతీన్ వేణు,బాపయ్య,వికాస్ రెడ్డి,రఫీ,నాయకులు లింగన్న ,కరుణాకర్ రెడ్డి అడ్ప శ్రీకాంత్,బురాజ్,గణేష్ ,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking