హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి జూలై 29
హుజురాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ కవి రచయిత, మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, సంపూర్ణ ఆధ్యాత్మిక బోధన గురువు, బ్రహ్మశ్రీ తత్వవేత్త నాగుల సత్యం గౌడ్ జాతీయస్థాయి సేవ రత్న అవార్డ్ అందుకున్నారు. జాతీయస్థాయి మెగా ఎంటర్ప్రైజెస్ సేవ సంస్థ ఆధ్వర్యంలో… ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు సామాజికవేత్త పి.శిరీష రెడ్డి, కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, యాక్టర్ అండ్ యాంకర్ భార్గవ్, డైరెక్టర్ టి రుద్ర శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్ అనుప్రసాద్, సామాజికవేత్తలు వేణుగోపాల్, విజయభాస్కర్, ఉమెన్ రైట్స్ సోషల్ సర్వీస్ చైర్మన్ అరుణ, ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త అమృత్, జెమినీ సురేష్ ,శ్యాంసుందర్, వివిధ సంస్థల అధ్యక్షులు సత్యగౌడ్ సామాజిక సేవలు, వారి రచనలు, ఆధ్యాత్మిక బోధనలు గుర్తించి.. వీరిని జాతీయస్థాయి సేవ రత్న అవార్డుకు ఎంపిక చేసి, ఈ యొక్క అవార్డును హైదరాబాద్ చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభ మీటింగ్ హాల్లో ఆదివారం రోజున సత్యంగౌడ్ కు పట్టు శాలువా కప్పి, జ్ఞాపకను అందజేసి,గురు కిరీటాన్ని గోల్డ్ మెడల్నును దరింపజేసి, సేవ రత్న అవార్డుతో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షరాలు పి శిరీష రెడ్డి, ముఖ్య అతిథులు ప్రముఖులు విద్యావేత్తలు, నాయకులు సత్యం గౌడ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షురాలు శిరీష రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ పలువురు ప్రముఖులు మాట్లాడుతూ…సత్యంగౌడ్ సామాజిక సేవలు, వారి సామాజిక రచనలు, ఆధ్యాత్మిక బోధనలు ముఖ్యంగా పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థుల ప్రయోజనం కోరుతూ… వారి ఉజ్వల భవిష్యత్తు కోసం, ప్రతి విద్యార్థి ప్రయోజకుడిగా ఎదిగి,చదువుతో పాటు, సమాజ సేవలో భాగస్వాములై, మనం ఏర్పరచుకున్న మానవతా విలువలు పెంపొందించుకోవాలి అనే పలు ప్రధాన అంశాల మీద సెమినార్లు ఇస్తున్న సత్యం గౌడ్ నిస్వార్థ సేవలు ఆదర్శప్రాయమన్నారు. అనంతరం సత్యంగాడు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు సేవ దృక్పదాన్ని అలవర్చుకొని మానవ జన్మను సార్థకం చేసుకోవాలని సూచించారు. స్వలాభం సంతృప్తి ప్రధానం కాదని, సాటి మనిషి మేలుకోరడంలోనే మానవత్వం దాగి ఉందన్నారు. ప్రతి ఒక్కరు, మనం ఏర్పరచుకున్న విలువలు కాపాడుకుంటూ, విలువైన పౌరులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో నృత్య కళాకారులు, ప్రముఖలు ప్రజా ప్రతినిధులు, సినీ, మరియు టివి నటులు, విద్యావేత్తలు, భక్తలు ప్రొఫెసర్లు డాక్టర్లు, కళాకారులు కవులు రచయితలు తదితరులు పాల్గొన్నారు.