హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి జూలై 29
హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో జెన్ ఫ్యాక్ట్ ఉపాధ్యక్షులు సబ్బాని వెంకట్ సగ్రామమైన సిర్సపల్లి వచ్చారని సమాచారం మేరకు వివిధ గ్రామాల నుండి ప్రజలు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల, బెల్లంపల్లి ,గోదావరిఖని, కరీంనగర్ జిల్లాల నుండి భారీ ఎత్తున ప్రజలు వచ్చారు. వారి యొక్క సమస్యలను తెలుసుకున్న సబ్బాని వెంకట్ నేనున్నానని వారికి భరోసా కల్పించి, నా వంతుగా పూర్తి సహాయ సహకారాలు మీకు మీ కుటుంబానికి అందిస్తానని హామీ ఇచ్చి తక్షణమే పరిష్కారం అయ్యే పిల్లల చదువులకు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలను విద్య సంస్థల యజమానులతో మాట్లాడి పరిష్కారం చేశారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉపాధి లేక ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని తెలుపగా తక్షణమే మీ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ అనేకమంది చదువుకున్న పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, ఆస్పత్రుల్లో చేరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనేకమంది మాలాంటి పేద ప్రజలకు సబ్బాని వెంకట్ ఆస్పత్రుల్లో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా నిస్వార్ధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా కుటుంబాలు ఆయనకు రుణపడి ఉంటాయని తెలిపారు.