ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం రేవంత్‌ రెడ్డి సుప్రీం కోర్ట్‌ కి అడ్వొకేట్లను పంపాడు.

గజ్జల కాంతం టీపీసీసీ నాయకులు..
ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా మాదిగలు పోరాటం చేస్తున్నారు.
ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, సుప్రీం కోర్ట్‌ కు చేరినా మాదిగలకు న్యాయం జరగలేదు.
పంజాబ్‌ ప్రభుత్వం కూడా వర్గీకరణ ను కోరితే అక్కడ హై కోర్ట్‌ దీన్ని కొట్టివేసింది.
దాన్ని సవాల్‌ చేస్తూ పంజాబ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్ట్‌ లో కేస్‌ వేశారు.
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పోరాటం చేసింది కాబట్టే ఈరోజు న్యాయం జరిగింది.
ఎస్సీ వర్గీకరణకు కారణం బీజేపీ అని కొందరు మాట్లాడుతున్నారు.
వర్గీకరణ జరగాలని కోరుకుంటే
మోదీ పార్లమెంట్లో బిల్‌ ను ఎందుకు పాస్‌ చేయలేదు?
ఈ పోరాటం కొనసాగాలని సీఎం రేవంత్‌ రెడ్డి సుప్రీం కోర్ట్‌ కి అడ్వొకేట్లను పంపాడు.
బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టుకలో వాదించేందుకు ఎందుకు చొరవ తీసుకోలేదు?
ఇది బీజేపీ ఘనత కాదు.
జనాభా ప్రాతిపదికన రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ జరుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking