అభినందనలు తెలిపిన యువ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
జూబ్లీహల్స్ ప్రజాబలం ప్రతినిధి :యువతకు హామీ ఇచ్చిన ప్రకారం ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి అభినందనలు తెలిపిన యువ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఈసందర్భంగా బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ
. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల నుండి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులని గాలికి వదిలేసింది ..నిధులు ,నీళ్లు,నియామకాలు కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిరది.
.అ కల నెరవేరాలని సోనియా గాంధీ తెలంగాణా రాష్ట్రం ఇచ్చారు.
.అ కల నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమని యువకులు నమ్మరు.
.అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడనికి ప్రచారం చేసి కీలక పాత్ర పోషించారు యువకులు,నిరుద్యోగులు.
.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా ,సీఎంరేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి చెప్పినట్లు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.
.నిరుద్యోగులకు ,యువకులకు ఒక భరోసా ఇచ్చేవిధంగా యుపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ఇచ్చింది ప్రజా ప్రభుత్వం .
.సీఎం,డిప్యూటీ సీఏం క్యాబినెట్ మంత్రులకు విద్యార్థి,నిరుద్యోగుల యువకుల పక్షాన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
. గ్రూప్ 2 పరీక్ష వాయిదా విషయంలో కూడా గత ప్రభుత్వం మాదిరి పంతాలకు పోకుండా యువకులు కోరుకున్న విధంగా ప్రజా ప్రభుత్వం పోస్ట్ పోన్ చేసింది .
. విద్యారంగం పై ,నిరుద్యోగుల పై ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ కి నా ధన్యవాదాలు.