రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 03 ఆగస్టు 2024:
వీ ఆర్ 4 సహయోగ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చైతన్య కాలేజీలో చదువిస్తున్న విద్యార్థినుల యొక్క రెండవ విడతగా సంవత్సర పూర్తి ఫీస్ కాలేజీ యాజమాన్యమ్ ఏ.సంపత్ కు విద్యార్థినిలు పూజా సింగ్, చక్రికల ద్వారా చెక్కులు అందచేయడమైనదని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలుపుతూ తదుపరి ట్రస్ట్ ఆనవాయితీగా సహాయ సహకారాలందించిన దాతలను తగిన విధముగా సత్కరించడమైనదని ఇట్టి శుభ పరిణామ సమయంలో మణికొండ కౌన్సిలర్లు బిట్లు పద్మారావు, ఆలస్యం నవీన్ కుమార్, ది సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కార్యదర్శి షేక్ ఆరిప్ మొహమ్మద్, ట్రస్ట్ అధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, ఉపాధ్యక్షుడు బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి, కోశాదికారి దిలీప్ కక్కడ్, కల్చరల్ కార్యదర్శి నరొత్తం సింగ్, ట్రస్టు సభ్యుడు తమ్మిశేట్టి రాజశేఖర్ తది తరులు పాల్గొన్నారు.
Next Post