ప్రజాబలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 3
తల్లిపాల వారోత్సవాల అవగాహన సదస్సు కార్యక్రమం శనివారం, నువ్వులబండ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో అంగన్వాడి నిర్వాహకురాలు బట్టు ఉష మాట్లాడుతూ తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందుతుంది, పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని తెలుపుతూ ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని అక్కడికి వచ్చిన తల్లులకు అవగాహన కల్పిస్తూ, ఏడవ నెల నుండి అదనపు ఆహారం అందిస్తూ, రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలని అక్కడికి వచ్చిన తల్లులకి తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో వై శైలజ, కే పద్మ ఆయా రేణుక, కాలనీవాసులు, అరుణ, కే సుజాత, తల్లులు, మహిళా సంగం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.