పార్టి బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా – టి నర్సింగ్‌ రావు

నియామక పత్రం అందజేసిన ఉస్మాన్‌ బిన్‌ మహమ్మద్‌ అలీ హజ్రీ
కార్వాన్‌ ప్రజాబలం ప్రతినిధి: జియాగూడ : గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి కేవలం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందని ఆ పార్టీ జీహెచ్‌ఎంసీ ఉపాధ్యక్షులుగా నియమితులైన టి నర్సింగ్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ… జీహెచ్‌ఎంసీకి ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని తెలిపారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ఖైరతబాద్‌ డిసీసి అధ్యక్షుడు డాక్టర్‌ సి రోహిన్‌ రెడ్డి, కార్వాన్‌ ఇన్చార్జ్‌ ఉస్మాన్‌ బిన్‌ మహమ్మద్‌ అలి హజ్రి , పార్టీ సినియర్‌ నాయకులు మిత్రకృష్ణ, సిహెచ్‌ బాల్‌ రాజ్‌, లక్ష్మన్‌ యాదవ్‌ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking