సి.ఐ.టి.యూ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణకై సంతకాల సేకరణ

 

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 18 :సింగరేణి సంస్థను ప్రైవేటుపరం కాకుండా బొగ్గు గనులు సింగరేణికే కేటాయించే విధంగా వారసత్వ పోరాటాలను కొనసాగిస్తూ సింగరేణి సంస్థను కాపాడుకోవల్సిన బాధ్యత యువ కార్మిక లోకానిదేనని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సోమవారం సి.ఐ.టి.యూ ఆద్వర్యంలో గనులపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి, మోడీ ప్రభుత్వం మొదటగా తెలంగాణపై ప్రైవేటీకరణ కత్తి పెట్టిందన్నారు. సింగరేణి సంస్థకు కేటాయించాల్సిన బొగ్గు గనులను, వేలంపాట ద్వారా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలకు పూనుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీన్నిసిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నదని, తెలంగాణకు సిరుల గనిగా, ఉపాధినిచ్చే వనరుగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్న కల్పతరువుగా సింగరేణి సంస్థ నడుస్తుందన్నారు. ఇటీవలి జరిగిన సిపిఎం మంచిర్యాల జిల్లా 3 వ మహాసభల సందర్భంగా మొదటి తీర్మానంగా సింగరేణి పరిరక్షణ కొరకు వేలం పాటను రద్దు కొరకు తీర్మానం చేశామని తెలిపారు. సింగరేణికే బొగ్గు గనులు కేటాయించాలని కోరుతూ కేకే-5 మైన్, ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్, జి. ఎం కార్యాలయాలలో సంతకాల సేకరణ చేయించడం జరిగందన్నారు. జిల్లా వ్యాప్తంగా నుండి 23 వరకు అన్ని మైన్స్ లో కార్మిక కాలనీలలో, వ్యాపారస్తులు, రైతులు, యువకులు, విద్యార్థులు, ప్రజల నుండి సంతకాల సేకరణ చేసి గవర్నర్ కు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి పంపించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సోషలిస్టు పార్టీ (ఇండియా) ముల్కల్ల కనకయ్య, బీఎస్పీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు, ముల్కల రాజేంద్ర ప్రసాద్, ఎంప్లాయీస్ యూనియన్ (సి.ఐ.టి.యూ) మందమర్రి ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking