ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 15:
జీనోం వ్యాలీ మెయిన్ రోడ్డు నుండి తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఇన్ప్రాస్టక్చర్ కార్పొరేషన్ పార్కుకు గాను ప్రత్యామ్నాయ రోడ్డు కోసం భూసేకరణ నిమిత్తం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు క్షేత్రస్థాయి భూపరిశీలన నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టరు మ్యాప్ లను పరిశీలించి మురారిపల్లి గ్రామస్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజయ్ వాటర్ ఫ్రంట్ ముందు నుండి రోడ్డుకై స్థలాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.