మేడ్చల్ మున్సిపాలిటీ పరిదిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనఖి చేసిన కలెక్టర్ గౌత‌మ్

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 16:
శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ గౌత‌మ్ పొట్రు మేడ్చల్ మున్సిపాలిటీ పరిదిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనఖి చేసినారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వీధి కుక్కల బారిన పడిన బధితులకు సత్వర ట్రీట్మెంట్ చేసి ఏ ప్రాంతం నుండి కుక్క కాటు గురైన వచ్చిన వారు తెలుసుకొని ఆ ప్రాంతం గురించి వివరములు మున్సిపల్ కమిషనర్ కి తెలియజేయడం వలన ఆ ప్రాంతం వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించినారు.
ఈ ప్రక్రియ వేగవంతం చేసి వీధి కుక్కలు, కోతులు భారీ నుండి ప్రజలను కాపాడే బాధ్యత మన అందరిదీ కావున వీధి కుక్కలు నుండి రక్షించుకోవడానికి కుక్కకాటుకు గురైనప్పుడు ప్రాథమికంగా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలలో అవగాహన కల్పించాలని వాతావరణ పరిస్థితులు మారుతున్నందున సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ జ్వరాలు వస్తుంటాయి. వాటర్, ఆహారము కలుషితం కాకుండా, మురుగు నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
రాపిడ్ టెస్ట్ కిట్ట్ ద్వారా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పరీక్షించి తీవ్రతను బట్టి జ్వర నిర్ధారణ చేసి అత్యవసరమైన వైద్యసాయం అందించాలని, డెంగ్యూ జ్వరము మార్క్ చేసిన ప్రాంతంలో గుర్తించి మున్సిపల్ స్థాయి సిబ్బంది, గ్రామీణ స్థాయి సిబ్బంది ద్వారా దోమల వ్యాప్తి చెందకుండా ప్రతిరోజు ఫాగింగ్ చేయించాలని అధికారులను ఆదేశించినారు. దానికి తగ్గట్టు ఆసుపత్రిలలో కావలసిన మందులు, బెడ్లను, రాపిడ్ టెస్ట్ కిట్స్ ను అదనముగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు, డెంగ్యూ జ్వరము వ్యాప్తి చెందకుండా ప్రత్యేకమైన వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ వైద్యం అందేటట్లు వైద్య అధికారులను ఆదేశించినారు.
ఈ సందర్బముగా సమీకృత సలహా పరీక్ష కేంద్రoను, ఆయుష్ విభాగం, ఫార్మసీ, ల్యాబ్, ఇన్- పేషoట్ /ఔట్-పేషంట్ విభాగాలను పరిశీలించిన పిదప ల్యాబ్లో అవసరమైన ఆధునికమైన టెస్టింగ్ ఎక్విప్మెంట్ లను అందుబాటులో ఉంచుకొని ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయలను అందించాలని తెల్పినారు.
ఈ కార్యక్రమములో పాల్గొన రఘునాథ్ స్వామి, జిల్లా వైద్య అధికారి, నాగి రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ కమిషనర్, వైద్య సిబ్బంది, సంబందిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking