ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 21:
శుక్రవారం నుండి మొదలైన పదవ తరగతి పరీక్షల నిర్వహాణను పరిశీలించిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం.
దుండిగల్ మండలంలోని మల్లంపేట లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నిర్వహాణను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టరు పరీక్షలు జరుగుతున్న తరగతి గదులలో తిరిగి విద్యార్థులు పరీక్షలు వ్రాయడాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మంచినీరు, లైట్లు, ఫ్యాన్లు సౌకర్యాలు ఉన్నాయా అని ఎంఈఓను అడిగి తెలుసుకున్నారు. పదవతరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పరీక్షలు సజావుగా నిర్వహించేలా చూడాలని కలెక్టరు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని కలెక్టరు తెలిపారు. అదే విధంగా స్కూలులో ఎంత మంది విద్యార్థులున్నారని, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబులు ఉన్నాయా అని కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. దుండిగల్ మండలంలో మొత్తం ఎన్ని ఉన్నత పాఠశాలలు ఉన్నాయని అడిగారు. కంప్యూటర్ ల్యాబ్ ను రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసారని ఎంఈఓ తెలుపగా, ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయని, ఇన్ స్ట్రక్టర్ ఉన్నారా అని అడిగారు. విద్యార్థులకు కంప్యూటర్ క్లాసులు ఏవిధంగా నిర్వహిస్తున్నారని కలెక్టరు ప్రశ్నించగా, వారానికి రెండు క్లాసుల చొప్పున ప్రతి సెక్షన్ వారికి కంప్యూటర్ క్లాసులు నిర్వహిస్తున్నామని ఎంఈఓ బదులిచ్చారు.
అనంతరం శామీర్ పేట మండలంలోని తూంకుంటలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టరు సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తరగతి గదులలో తిరిగి విద్యార్థులు పరీక్షలు వ్రాయడాన్ని కలెక్టరు తనిఖీ చేసారు. కలెక్టరు స్కూల్ యాజమాన్యాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో దుండిగల్ తహాసీల్దారుస మతీన్, శామీర్ పేట తహాసీల్దారు యాదగిరిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.