సీసీ రోడ్డు నిర్మాణంతో కాలనివాసుల హర్షం

👉గత 15 సంవత్సరాలుగా పడుతున్న కష్టం

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 8 ( ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా: అందోల్ నియోజకవర్గం పుల్కల్ మండల పరిధిలో గల పోచారం గ్రామంలో, ఎస్సీ కాలనీవాసులు, తమ కాలనీలలో సీసీ రోడ్డు లేక గత 15 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతూనే, కాలం వెల్లుబుచ్చుతూ వచ్చారు, అయితే మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవతో, పుల్కల్ మండలం పోచారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈరోజు సి,సి,రోడ్డు వేయడంతో ఎస్సీ కాలనీ వాసులు ఎంతో సంతోషపడ్డారు, గత ప్రభుత్వం పదేళ్లు పరిపాలించిన, మా గల్లీలో సి,సి, రోడ్లను పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎస్సీ గల్లీలన్నీ మారుతున్నాయని సీ,సీ, రోడ్లతో కళకళలాడుతున్నాయని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి,లక్ష్మారెడ్డి, మరియు మాణిక్యరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాణిక్యం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కళ్ళపల్లి బాలరాజ్, మాజీ వార్డ్ మెంబర్ శంకర్, మన్నె శ్రీహరి, బేగరి నర్సింలు, కృష్ణ. శ్రీనివాస్,యాదయ్య, తదితరులు పాల్గొని, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు, పోచారం, ఎస్సీ, కాలనీవాసులందరూ ధన్యవాదాలు తెలియజేశారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking