రాజేంద్రనగర్ ప్రజాబలం ప్రతినిధి: AVOPA రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు స్రవంతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మణికొండ లోని బి ఆర్ సి దగ్గర జరిగింది.
ఈ కార్యక్రమంలో AVOPA రాష్ట్ర అధ్యక్షుడు మల్లిపెద్ది శంకర్ , రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శిల్ప, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొడ్డు శ్రీధర్ పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇమ్మడి జెవెల్లెర్స్ అధినేత ఇమ్మడి రమేష్ పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ మహిళల యొక్క విలువ సమాజంలో మహిళల పాత్ర సమాజ అభివృద్ధిలో మహిళ పాత్ర గురించి మాట్లాడడం జరిగింది.
మహిళా దినోత్సవం అంటే నాలుగు గోడల మధ్యలో కాదు బయట బహిరంగంగా ప్రజలంద సమక్షంలో ఒక ధర్మకార్యం నెరవేర్చడం కోసం అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది.

ఈ సందర్భంగా 10 సంవత్సరాల అనుభవం నుండి వివిధ రంగాలలో పని చేస్తున్నటువంటి మహిళలను సన్మానించడం జరిగింది, ఒక పేద మహిళలకు కుట్టు మిషన్ బహుకరించడం జరిగింది. ఈ సమాజంలో అత్తామామలకు సేవ సేవ చేస్తున్నటువంటి మహిళలను గుర్తించి వారిని సన్మానించడం జరిగింది.
చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
పేద మహిళలకు చీరలు పంచడం జరిగింది.