మహిళా శక్తి అనంతమైనది

👉మాజీ ఎంపిటిసి సూర మాధవరెడ్డి.

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చ్ 08(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/మహిళా దినత్సవo సందర్భంగా సదాశివపేట మండలంలోని నిజాంపూర్ గ్రామంలో మాజీ ఎంపిటిసి సూర మాధవరెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు, ఆశ వర్కర్లకు, అంగన్వాడి ఆయలకు, ఏఎన్ఎం లకు, డ్వాక్రా గ్రూపు మహిళలకు, సీఏ లకు ఘనంగా సన్మానించడం జరిగింది,ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి సూరా మాధవరెడ్డి మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళ ఆమె శక్తియుక్తులు అపారం ఆమె ఓ ప్రేరణ. ఓ లాలన. ఆమె లేకుంటే ఈ సృష్టి లేదు. దానికి గమ్యం, గమనం లేదు. మనిషికి జీవం, జీవితమే లేదు. ఆమే లేకుంటే అంతా శూన్యం. అందుకే ఆమెకు శతకోటి వందనాలు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చరిత్ర సృష్టిస్తున్నారన్నారు,అవకాశాలు రాకపోయినా, అవమానాలు ఎదురైనా, ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురుచూడడం లేదు. ఆకాశం, అవకాశాల్లో సగంగా అంటూ ముందం జలో దూసుకుపోతున్న స్త్రీమూర్తులెందరో. వంట గదికే ఆమెను అంకితం చేయొద్దని. వారిలోని ప్రతిభను వెలికి తీయాలన్నారు,ఈ కార్యక్రమంలో బి రమేష్, సురా సుభాష్ రెడ్డి, మాజీ సర్పంచ్ మఠం కరుణాకర్, తలారి ప్రకాష్, ధనుంజయ్, తలారి దేవశ్యం, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking