ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రిగా సత్ఫలితాలనిచ్చిన మంత్రి సురేఖ కృషి
ప్రజాబలం దినపత్రిక మెదక్ నియోజకవర్గం
30.09.2024
ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ దిశగా జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి ప్రయత్నాలు ఫలించాయి. మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై ఈ రోజు మంత్రి సురేఖ గారు మంత్రి దామోదర రాజనరసింహ గారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తో గంటకు పైగా చర్చలు జరిపారు. పలు సమీకరణాల పై సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీ పై స్పష్టతనిచ్చారు. దసరా లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ పూర్తి చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సురేఖకు తెలిపారు.